ఐదోబ్లాకు సకల హంగులతో సిద్ధమవుతోంది..
- July 12, 2016
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఐదోబ్లాకు సకల హంగులతో సిద్ధమవుతోంది. మెట్లకు ఫినిషింగ్, లిఫ్టుల ఏర్పాటు, భవనానికి బయటి వైపు పెయింటింగ్స్ తప్ప.. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియల్ డెకరేషన పనులను కూలీలు రేయింబవుళ్లు షిఫ్టుల పద్ధతిలో చేస్తున్నారు. ఐదో బ్లాకు ప్రవేశ ద్వారానికి గ్లాసు డోర్లు అమర్చారు. కింది ఫ్లోర్లో ఎలక్ర్టికల్, నెట్, ఫైరు పనులు పూర్తయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, కార్మిక, వైద్యఆరోగ్య శాఖలకు ఉద్యోగుల ఫర్నిచర్, మంత్రులు, కార్యదర్శుల చాంబర్లనూ సిద్ధం చేసేశారు. రవాణాశాఖ మంత్రి ఈనెల 21న తన చాంబర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయ భవనాలను మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మంగళవారం మంత్రి నారాయణతో కలసి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ విశేషాలను మంత్రి శ్రీనివాస్‌కి వివరించారు. మంత్రుల చాంబర్లను రాయపాటి పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మంగళవారం తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల చాంబర్లను ఆయన పరిశీలించారు. మంత్రి నారాయణతో కొద్దిసేపు చర్చించారు. ఈ నెల 21న రెండు శాఖల కార్యాలయాలు ప్రారంభమవుతాయన్నారు. ఇక్కడకు వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







