ఇమ్మిగ్రేషన్ హోదాకోసం రాష్ట్ర ప్రభుత్వం సత్వరం కృషి..
- July 12, 2016
టోక్యోకు విమానంపై జపాన్ పట్టు
సింగపూర్‌దీ ఇదే వరస..
సౌకర్యంగా భావించటం లేదని ఏపీ చాంబర్స్ ఆందోళన
కస్టమ్స్ హోదా వచ్చిన దేశాలకు విమానాలు నడపొచ్చు
విదేశీ పారిశ్రామిక వేత్తలు అమరావతికి చేరుకోవడానికి విమాన సర్వీసులు లేకపోవడం అతి పెద్ద అవరోధంగా పరిణమిస్తోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా ప్రయాణానికి విదేశీ సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం, కేంద్రంతో సంప్రదింపులు చేసి విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సి ఉంది. నవ్యాంధ్ర రాజధానికి విదేశీ పారిశ్రామికవేత్తలు నేరుగా చేరుకోవటానికి విమాన సర్వీసులు లేకపోవటం వల్ల పారిశ్రామికరంగం పురోభివృద్ధి చెందటానికి అతిపెద్ద అవరోధంగా మారుతోంది. అమరావతి రాజధానిలోనూ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇండస్ర్టియల్ యూనిట్ల ఏర్పాటు కోసం విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న వారు, అనేక సంస్థల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిన వారు, వర్తక, వాణిజ్య వ్యవహారాలను నెరపాలనుకునే వారంతా రాజధాని ప్రాంతానికి నేరుగా చేరుకోవటంపైనే దృష్టి సారిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న జపాన్ నుంచి అయితే ఒక రకంగా డైరెక్టు విమాన సర్వీసుల కోసం ప్రభుత్వంపై ఒత్తిళ్ళు కూడా వస్తుండటం గమనార్హం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో తలపెట్టిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు అనేకదేశాల నుంచి వివిధ సంస్థలు ఆసక్తి చూపాయి.రాజధాని ప్రాంతంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న విదేశీ కంపెనీల ప్రతినిథులు ఇక్కడికి చేరుకోవటం దుర్లభంగా మారుతోంది. విదేశీ పారిశ్రామికవేత్తలు రాజధాని ప్రాంతానికి చేరుకోవాలంటే హైదరాబాద్ రావాల్సి వస్తోంది. అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ కానీ, షెడ్యూల్ విమానాలలోగానీ గన్నవరం రావాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించటానికి జపాన్, చైనా, అమెరికా, లండన్, యూరప్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఇక్కడి వనరుల గురించి ప్రస్తావిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న సింగిల్ డెస్క్ పాలసీతో పాటు, అనేక రాయితీలు, ప్రోత్సాహాల గురించి చెబుతున్నారు. చాలా సంస్థలతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. విదేశాలలోని ఆయా సంస్థలకు చెందిన ప్రతినిథులు, ఉన్నతాధికారులు ఇక్కడ పరిశీలించటానికి, వ్యవహారాలను పర్యవేక్షించటానికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. నేరుగా రాజధాని ప్రాంతానికి విమానాలు లేకపోవటమే దీనికి కారణం. రాజధాని ప్రాంతానికి నేరుగా విమానాలు లేకపోవటం వల్ల హైదరాబాద్ వచ్చి ఇక్కడికి రావాల్సి వస్తోంది. విదేశీ పారిశ్రామికవేత్తలు దీనిని అసౌకర్యంగా భావిస్తున్నారు. పారిశ్రామికంగా ఎన్ని రాయితీలు కల్పించినా.. డైరెక్టు ఫ్లైట్ వంటి సదుపాయాలు లేకపోవటం వల్ల అతిపెద్ద అవరోధంగా మారుతోంది. జపాన్ పారిశ్రామికవేత్తలు టోక్యోకు డైరెక్టు ఫ్లైట్ గురించి ప్రభుత్వంపై ఒత్తిళ్ళు తీసుకు వస్తున్నట్టే... సింగపూర్ పారిశ్రామికవేత్తల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం, కేంద్రంతో సంప్రదింపులు చేసి విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సి ఉంది.విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రస్తుత పరిస్థితి బెజవాడ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ఇంకా విస్తరణకు నోచుకోలేదు. విస్తరణకు అవసరమైన 600 ఎకరాల భూములను ఈ నెలాఖరుకు అప్పగిస్తామని జిల్లా యంత్రాంగం నుంచి హామీ వచ్చింది. భూ సేకరణ జరిగితేనే విమానాశ్రయ రన్‌వేను 7వేల అడుగుల మేర విస్తరించటం సాధ్యం అవుతుంది. రన్‌వేను 7వేల అడుగుల మేర విస్తరించగలిగితే భారీ విమానాలు కూడా ల్యాండింగ్, టేకాఫ్‌కి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పాత టెర్మినల్ బిల్డింగ్‌ను 500 మంది ప్రయాణీకులకు అనువుగా తీర్చిదిద్దారు. ఇంటీరియమ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. ఇంటీరియమ్ టెర్మినల్ బిల్డింగ్‌ను 1200 మంది ప్రయాణీకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్స్ హోదావస్తే.. ఎంచక్కా విదేశాలకు విమానాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌పైనా, కస్టమ్స్ హోదాలపైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కనీసం కస్టమ్స్ హోదా అయినా ముందు వస్తే ఆసియా దేశాలకు విమానాలు నడవటానికి అవకాశం ఉంటుంది. ఆసియాకు చెందిన దేశాలే పెట్టుబడుల జాబితాలో ఉండటం వల్ల కనీసం కస్టమ్స్ హోదా అయినా సాధ్యమైనంత త్వరగా సాధించాల్సి ఉంది. ఇమ్మిగ్రేషన్ హోదాకోసం రాష్ట్ర ప్రభుత్వం సత్వరం కృషి చేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







