హజ్ మిషన్‌..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!

- June 11, 2025 , by Maagulf
హజ్ మిషన్‌..420,000 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం..!!

మక్కా: 1446 హిజ్ హజ్ సీజన్‌లో యాత్రికులకు సేవ చేయడానికి సహకరించిన 420,000 మందికి సుప్రీం హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వారికి తవక్కల్నా యాప్ ద్వారా డిజిటల్ ప్రశంసా పత్రాలను జారీ చేసింది. సుప్రీం హజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఖలీద్ అల్-సైఖాన్ మాట్లాడుతూ.. హజ్ మిషన్‌లో మొత్తం 420,070 మంది పాల్గొన్నవారిని తస్రీహ్ ప్లాట్‌ఫామ్ ద్వారా గుర్తించామని తెలిపారు. ఈ చొరవ సుప్రీం హజ్ కమిటీ పర్యవేక్షించే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విజయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.హజ్ కార్మికుల అంకితభావాన్ని గుర్తించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించి ఈ రకమైన చొరవ ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com