బర్త్‌డే పార్టీలో గంజాయి.. మంగ్లీపై కేసు..
- June 11, 2025
హైదరాబాద్: ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టి రోజు వేడుకల్లో గంజాయి కలకలం రేగింది.ఈ వేడుకల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
సింగర్ మంగ్లీ పుట్టి రోజు జూన్ 10. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో బర్త్ డే పార్టీని ఇచ్చింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మొత్తం 48 మంది వరకు ఈ పార్టీకి హాజరు అయ్యారని తెలుస్తోంది. ఈ రిసార్టు పై అర్థరాత్రి రెండు గంటల తరువాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీని నిర్వహించడం, గంజాయి, విదేశీ మద్యం దొరకడంతో ఫోక్ సింగర్ మంగ్లీ, త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ ల పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే ను పోలీసులు సీజ్ చేశారు.
మంగ్లీ బర్త్ డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







