హజ్.. 234 మిలియన్లకు పైగా ఫుడ్, కామడిటిస్ పంపిణీ..!!
- June 11, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ సందర్భంగా యాత్రికులకు 234 మిలియన్లకు పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబడినట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సామాగ్రిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పంపిణీ చేసిన వాటిల్లో అత్యధికంగా జ్యూస్లు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, బాటిల్ వాటర్, బేక్డ్ గూడ్స్, టిన్ ఫుడ్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించింది. అదే సమయంలో వాణిజ్య సంస్థలు, రిటైల్ పాయింట్లు, స్టాల్స్పై మంత్రిత్వశాఖలోని పర్యవేక్షక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు అవసరమైన వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న పలు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







