బహ్రెయిన్‌లో రాంగ్ రూట్ డ్రైవింగ్.. మహిళ అరెస్ట్..!!
- June 11, 2025
మనామా: బహ్రెయిన్ లోని కింగ్ ఫైసల్ హైవేపై ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వాహనం నడిపిన మహిళను అధికారులు అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేశారు.
అంతకుముందు, సదరు మహిళ కింగ్ ఫైసల్ హైవేపై ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వాహనం నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు. మహిళ నడిపిన వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తనతోపాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన మహిళను అరెస్ట్ చేసి, కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. కాగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ అధిపతి తెలియజేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ చట్టాలను పాటించడం చాలా అవసరమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్