కూంబింగ్ లో పేలిన ఐఈడి–ఎఎస్ఐ దుర్మరణం
- June 14, 2025
భువనేశ్వర్: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.అప్రమత్తమైన ఒడిశా పోలీసులు..ఐఈడీ (IED) పేలిన పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.మృతి చెందిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్‌ను ఏఎస్ఐ సత్యబాన్ కుమార్ సింగ్(34)గా గుర్తించారు.తీవ్ర గాయాలపాలైన కుమార్ సింగ్‌ను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.కుమార్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లా.రూర్కేలాలోని కే బాలంగ్ గ్రామ సమీపంలోని అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది.ఈ ఘటన శనివారం ఉదయం 6 గంటలకు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!