ఏపీ విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్ పాస్‌లు
- June 14, 2025
అమరావతి: వేసవి సెలవులు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టగా, వారి ప్రయాణాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) ముఖ్యమైన ప్రకటన చేసింది.అయితే విద్యార్థులు ప్రయాణాల కోసం ఆర్టీసీ బస్సు పాస్‌లను ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు చదివే పిల్లలకు ఈ పాస్‌లను ఉచితంగా అందిస్తోంది. ఈ నెల 13 నుంచి అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే పాత పాస్‌లు ఉన్నవారు వాటిని మార్చుకోవాలని కొత్త పాస్‌లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అదే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నెల, మూడు నెలలు, ఏడాది కాలానికి చెల్లుబాటయ్యే పాస్‌లు డబ్బులు చెల్లించి తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు వారి మొబైల్ నుంచి http://apsrtconline.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.స్కూల్ విద్యార్థులు బస్ పాసుల కోసం హెడ్ మాస్టర్ (ప్రధానోపాధ్యాయుడు) సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్ తీసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వీటిని తీసుకుని డిపోల్లోని బస్ పాస్ కౌంటర్లో సంప్రదించాలని సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన గురువారం నుంచే విద్యార్థులకు బస్సు పాసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే డిపోల్లో అవసరమైన కార్డులు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామంటున్నారు అధికారులు. విద్యార్థుల వివరాలు నమోదవ్వగానే ఓటీపీ విధానంతో వేగంగా పాసులు జారీ చేస్తామని చెబుతున్నారు. సెప్టెంబరు వరకు ఈ బస్‌పాస్‌ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.ఏపీలో ఈ నెల 12 నుంచి వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, షూస్, బ్యాగ్ సహా కిట్‌లను కూడా అందజేశారు. అంతేకాదు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు.ఇటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు.విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలో డబ్బుల్ని కూడా విడుదల చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..