యాదగిరిగుట్టలో వ్రతం టికెట్ల ధరలు పెంపు
- June 14, 2025
తెలంగాణ: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఆలయ దేవస్థానం అధికారులు నరసింహస్వామి భక్తులకు షాక్ ఇచ్చారు. వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యాదాద్రిలో వ్రతం టికెట్ ధర రూ.800గా ఉండగా.. దాన్ని ఇప్పుడు రూ.1000కి పెంచారు. అన్నవరం తర్వాత భక్తులు ఎక్కువగా యాదగిరిగుట్టలోనే వ్రతాలు చేయించుకుంటారు. ఇప్పుడీ టికెట్ రేటు పెంచడంతో భక్తులు మండిపడుతున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







