మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. అదుపునకు 6గంటలపాటు ఆపరేషన్..!!
- June 14, 2025
యూఏఈ: దుబాయ్లోని మెరీనాలోని 67 అంతస్తుల ఎత్తైన భవనంలో శుక్రవారం రాత్రి సంభవించిన మంటలను అధికారులు అదుపు చేశారని దుబాయ్ మీడియా ఆఫీస్ (DMO) వెల్లడించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు మంటలను ఆర్పడానికి ఆరు గంటలు అవిశ్రాంతంగా శ్రమించాయి. ప్రత్యేక విభాగాలు మెరీనా పినాకిల్లోని 764 అపార్ట్మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా తరలించారు.
శనివారం తెల్లవారుజామున 2.21 గంటలకు, విజయవంతమైన తరలింపు ప్రయత్నాల గురించి DMO మరిన్ని వివరాలను తెలిపింది. బాధిత నివాసితుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ..వారికి తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఇప్పుడు భవనం డెవలపర్తో కలిసి పనిచేస్తున్నారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత కూడా టవర్ నుండి పొగ ఇంకా పైకి లేచినట్లు పలువురు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మెరీనా పినాకిల్.. దీనిని టైగర్ టవర్ అని కూడా పిలుస్తారు. అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. మే 25, 2015న 47వ అంతస్తులో వంటగదిలో జరిగిన ఒక సంఘటనలో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ వారు అదుపులోకి తీసుకునే లోపు అది 48వ అంతస్తుకు వ్యాపించింది. 67 అంతస్తుల మెరీనా పినాకిల్ ది టార్చ్ సమీపంలో ఉంది.ఇది 2015, 2017లో రెండుసార్లు మంటల్లో చిక్కుకున్న మరో స్కైస్రేపర్. తాజా అగ్నిప్రమాదంలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..