ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!

- June 14, 2025 , by Maagulf
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ట్రంప్ చర్చలు..!!

రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలను, ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక కార్యకలాపాలపై చర్చించారు. ఇద్దరు నాయకులు సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించడం ప్రాముఖ్యతను తెలియజెప్పారు. దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యం అంతటా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర ఉమ్మడి ప్రయత్నాల ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్, అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com