మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. తమ పౌరులకు ఒమన్ అలెర్ట్..!!

- June 14, 2025 , by Maagulf
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు.. తమ పౌరులకు ఒమన్ అలెర్ట్..!!

మస్కట్: ఉద్రిక్తత లేదా సాయుధ సంఘర్షణ ఎదుర్కొంటున్న ప్రాంతాలలో నివసిస్తున్న లేదా ప్రయాణించడానికి ప్రణాళిక వేసుకున్న ఒమానీ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్న భద్రతా పరిణామాల దృష్ట్యా వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. పరిస్థితులు అనుకూలించిన వెంటనే అటువంటి ప్రాంతాలలో ఉన్న పౌరులు అక్కడి నుండి బయలుదేరాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక మొబైల్ అప్లికేషన్ లేదా +968 24634397 నంబర్‌లో ఆపరేషన్స్ ఆఫీస్‌ను సంప్రదించడం ద్వారా సమీపంలోని ఒమానీ రాయబార కార్యాలయంలో సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ప్రభావిత దేశాలకు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com