'8 వసంతాలు' విజువల్లీ పొయెటిక్, హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్
- June 16, 2025
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్, టీజర్లు, పాటలు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
'ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకి కర్మ కాండలకు వాళ్లు పనికిరారు'' అంటూ ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలకు ''పేగు పంచి ప్రాణం పొయ్యగలిగిన వాళ్ళం.. చితిముట్టించి మోక్షం ఇప్పించలేమా''అంటూ అనంతిక బదులు చెప్పిన సన్నివేశంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ఇది కేవలం ఒక మహిళ ప్రయాణం కాదు, సమాజంలో చెరపాల్సిన మూఢనమ్మకాలకు ఎదురు నిలిచే కథని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
తండ్రి చేతే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ, ఆనందం, ప్రేమ, విషాదం లాంటి అనుభూతులతో అనంతిక ప్రయాణం సాగుతుంది. ప్రతి వసంతం ఒక కీలక మలుపు. ఆమె ఒక కుమార్తెగా మొదలై, కొన్ని విధానాలను ఎదిరించే ధైర్యవంతురాలిగా మారడాన్ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
అనంతికా సనీల్‌కుమార్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఆమె క్యారెక్టర్ లో ఎమోషన్స్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఒక మటన్ షాప్‌లో జరిగే యాక్షన్ సీన్ ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ముఖ్య పాత్రలలో ఆకట్టుకున్నారు. వీరి పాత్రలు కూడా కథకు అర్థవంతమైన బలాన్నిస్తాయి.
లోతైన కథలు చెప్పడంలో పాపులరైన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి కథనాన్ని కవిత్వం లాగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రతి భావోద్వేగాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం మనసుని తాకేలా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యుత్తమంగా వున్నాయి.
ఆర్ట్ డైరెక్షన్ అరవింద్ ములే, ఎడిటింగ్ శశాంక్ మాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబాసాయి కుమార్ మామిడిపల్లి.
బోల్డ్ కథనం, అద్భుతమైన విజువల్స్, మరపురాని పెర్ఫార్మెన్స్ లతో ‘8 వసంతాలు’ భావోద్వేగాలతో నిండిన సినిమాటిక్ అనుభూతిని ఇవ్వనుంది. ఈ మనసుకు తాకే విజువల్ వండర్ జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







