'ఆంధ్రా కింగ్ తాలూకా' హైదరాబాద్‌లో టాకీ పార్ట్ షూటింగ్
- June 16, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యుమినియం ఫాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో రామ్, ఉపేంద్ర పాల్గొంటున్నారు. కీలక టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. రామ్, ఉపేంద్ర కాంబినేషన్ లో వచ్చే ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా ఉండబోతున్నాయి.
ఈ సినిమాలో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్ ని చేస్తున్నారు.
ఇటివలే రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమా కోసం యూనిక్ కథని రాశారు. ఈ సినిమా ఆడియన్స్ కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది. అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా భారీ అంచనాలని పెంచుతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నూని, మ్యూజిక్ వివేక్–మర్విన్. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.
తారాగణం: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ - మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!