కువైట్‌లో ఇండియన్ ఎంబసీ, డాక్టర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- June 16, 2025
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారత వైద్యుల ఫోరం సహకారంతో జూన్ 14న అడాన్ హాస్పిటల్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కువైట్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్ అవధి, కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా, సీనియర్ కువైట్ అధికారులు డాక్టర్ రీమ్ అల్ రద్వాన్, డాక్టర్ హనన్ అల్ అవధి, భారతీయ వైద్యుల ఫోరం సీనియర్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
కువైట్‌లోని భారతీయ ప్రవాసులు రక్తదానం చేసే సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ.. పెద్ద సంఖ్యలో భారతీయ సమాజ సభ్యులు, ఇతర ప్రవాస సంఘాల నుండి కొందరు రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారత రాయబార కార్యాలయం, భారతీయ సమాజం మొత్తం కువైట్‌లో క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. 2024లో ఎంబసీ, ఇండియన్ డాక్టర్స్ ఫోరం నిర్వహించిన రక్తదాన శిబిరాలతో పాటు, కువైట్‌లోని వివిధ భారతీయ సమాజ సంఘాలు 50 కి పైగా రక్తదాన శిబిరాలను చేపట్టాయి.
రక్తదాన శిబిరాలతో పాటు కువైట్‌లోని భారతీయ సమాజం మద్దతుతో భారత రాయబార కార్యాలయం.. చెట్ల పెంపకం, బీచ్ క్లీనింగ్, కువైట్‌లో పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం కోసం వివిధ కార్యక్రమాలు , శిబిరాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!