అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు: డైరెక్టర్ మారుతీ

- June 16, 2025 , by Maagulf
అక్కడ మా నాన్న అరటిపండ్లు అమ్మేవాడు: డైరెక్టర్ మారుతీ

నేడు ప్రభాస్ రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. పలు థియేటర్స్ లో కూడా టీజర్ స్క్రీనింగ్ వేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కటౌట్స్ కూడా భారీగా పెట్టారు. ఈ క్రమంలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.

మారుతిది మచిలీపట్నం అని తెలిసిందే. మచిలీపట్నంలో సిరి కాంప్లెక్స్ థియేటర్ వద్ద ప్రభాస్ – మారుతీ కటౌట్ పెట్టారు.

డైరెక్టర్ మారుతీ ఈ కటౌట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ ప్లేస్ లో మా నాన్న ఒక చిన్న స్టాల్ లో అరటిపండ్లు అమ్మేవాడు. నేను ఇక్కడ కట్టే బ్యానర్స్ రాసేవాడిని. ఆ బ్యానర్స్ పై ఒక్కసారైనా మన పేరు చూడాలి అని కలలు కనేవాడిని. ఎక్కడ మొదలుపెట్టానో అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఒక సైకిల్ లాంటిది. నేను మొదలుపెట్టిన చోటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు నా కటౌట్ పెట్టారు. ఇది చాలదా. మా నాన్న ఇది చూసి ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మిస్ యు నాన్న. నేను ఇప్పుడు మోస్తున్న కృతజ్ఞతకు ధన్యవాదాలు అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. టీజర్ చెప్పిన టైం కి వస్తుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com