యూఏఈ: ఆన్లైన్‌లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసితే జైలు శిక్ష, జరిమానా

- June 16, 2025 , by Maagulf
యూఏఈ: ఆన్లైన్‌లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసితే జైలు శిక్ష, జరిమానా

యూఏఈ: దేశ ప్రతిష్ఠను ఆన్లైన్‌లో అవమానించటం తగదని యూఏఈ అధికారులు హెచ్చరించారు. అబుధాబి న్యాయ విభాగం ఏప్రిల్ 29న ఎక్స్ (మునుపటి ట్విటర్) లో చేసిన ప్రకటన ప్రకారం, దేశం, ప్రభుత్వ సంస్థలు, అధికారులు అవమానించబడే విధంగా సమాచారాన్ని ప్రచురించిన వారికి ఐదు సంవత్సరాలతో జైలు శిక్షతో పాటు AED 500,000 వరకు జరిమానా విధించబడుతుందని పేర్కొనింది.

ఫెడరల్ చట్టం నెం (34) ఆఫ్ 2021 (అపవాదులు మరియు సైబర్ నేరాలతో పోరాటం) లోని ఆర్టికల్ (25) ప్రకారం ఇది వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న అబు ధాబి పోలీసు ప్రజలకు తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చెయ్యకూడదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, సమాజ విభజనకు కారణమయ్యే, నెగిటివ్ పోస్ట్‌లు చేసే వారికి Dh1 మిలియన్ వరకు జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడవచ్చని నిపుణులు తెలిపారు.

సోషల్ మీడియా వాడకంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని, ఏ సమాచారం పంచుకునే ముందు దాని నిజనిజాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com