ఇజ్రాయెల్ తో వార్.. టెహ్రాన్ వదులుతున్న పౌరులు, నివాసితులు..!!

- June 18, 2025 , by Maagulf
ఇజ్రాయెల్ తో వార్.. టెహ్రాన్ వదులుతున్న పౌరులు, నివాసితులు..!!

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్.. ఇజ్రాయెల్‌తో వివాదం తీవ్రతరం కావడంతో వేలాది మంది నివాసితులు, పౌరులు వలస బాట పట్టారు.  ఎప్పుడు సందడిగా ఉండే డౌన్‌టౌన్ ఖాళీగా దర్శనమిస్తుంది. అనేక దుకాణాలను మూసివేశారు. చారిత్రాత్మక గ్రాండ్ బజార్ మూతపడ్డది. 

సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్ మిడిల్ లో నివసిస్తున్న 330,000 మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో భయంతో వేలాది మంది వసల బాట పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.   దాంతో నగరం నుండి బయటకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. చాలామంది కాస్పియన్ సముద్ర ప్రాంతం వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఇంధనం కోసం నివాసితులు ఇబ్బంది పడుతుండగా గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా పొడవైన క్యూలు ఉన్నాయి. ఇంధనం సంక్షోభం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో కారుకు 25 లీటర్ల వరకే ఇంధనం అంటూ పరిమితులను విధించారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్‌లో ఇరాన్ రాజధానిని వెంటనే ఖాళీ చేయమని పిలుపునిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేయడం కూడా ఆందోళనలను మరింత పెంచింది.  ఇదిలా ఉండగా, ప్రజల వలసలు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితి అదుపులో ఉందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com