ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!

- June 18, 2025 , by Maagulf
ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!

లండన్: ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ పై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కీలక ప్రకటన చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరించారు. తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. "రాజకీయ, దౌత్య పరిష్కారాలకు ప్రత్యామ్నాయం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి , భద్రతా మండలి జోక్యం చేసుకుని పెరుగుతున్న హింసను ఆపాలని పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వాటి సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం ఉందని, ఇది మరింత తీవ్ర నష్టాని దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  "రెండు పార్టీలను ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందేలా, శత్రుత్వాలను అంతం చేయడానికి పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీయకుండా నిరోధించడానికి దౌత్యపరమైన విధానం అత్యవసరం అని యూఏఈ విశ్వసిస్తోంది." అని ఆయన అన్నారు.  సంఘర్షణలను ఆపేందుకు అంతర్జాతీయ దౌత్యం అవసరమని తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com