అత్యవసర ఎయిర్ పోర్ట్ రెస్పాన్స్ ఏయిర్ స్పేస్ ను యాక్టివేట్ చేసిన యూఏఈ..!!

- June 18, 2025 , by Maagulf
అత్యవసర ఎయిర్ పోర్ట్ రెస్పాన్స్ ఏయిర్ స్పేస్ ను యాక్టివేట్ చేసిన యూఏఈ..!!

యూఏఈ: గల్ఫ్ లో ఉద్రిక్తతలు పెరగడం, విమాన ప్రయాణ మార్గాలు మరియు షెడ్యూల్‌లకు తీవ్ర అంతరాయం కలగడం నేపథ్యంలో యూఏఈ తన అత్యవసర విమానాశ్రయ ప్రతిస్పందన ప్రణాళికను యాక్టివేట్ చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా 24 గంటలూ ఫీల్డ్ బృందాలను మోహరించనున్నారు. ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. దేశ విమానాశ్రయాల ద్వారా ప్రయాణీకుల ప్రయాణం సజావుగా సాగడానికి సమగ్ర ప్రణాళికను ప్రారంభించినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ధృవీకరించింది. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి అన్ని సంబంధిత కార్యాచరణ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అథారిటీ తెలిపింది. యూఏఈ విమానాశ్రయాలలో 24 గంటలూ క్షేత్ర బృందాలను మోహరించారు. ప్రయాణీకుల రద్దీని నిర్వహించడానికి, ఇమ్మిగ్రేషన్ విధానాలను సులభతరం చేయడానికి , ప్రభావిత విమానాలను తిరిగి షెడ్యూల్ చేయడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు.

తాత్కాలిక వసతి, రియల్-టైమ్ అప్‌డేట్‌లు

విమానాల ఆలస్యం లేదా దారి మళ్లింపు కారణంగా చిక్కుకున్న ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులు తాత్కాలిక వసతి, రియల్-టైమ్ అప్‌డేట్‌లు, లాజిస్టికల్ సహాయం అందించారు.  ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసాయి. దాంతో విమాన సర్వీసులు రీరూటింగ్‌ ను అమలు చేస్తున్నాయి.  పలు దేశాలు తమ వైమానిక ప్రాంతాను మూసివేసిన క్రమంలో అత్యవసర ప్రోటోకాల్ వెంటనే యాక్టివేల్ చేసినట్లు, విమానాల రీరూటింగ్ ను ఎదుర్కోవడానికి వేగవంతమైన కార్యాచరణను ప్రారంభించినట్లు ICP వివరించింది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com