యోగా నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు: హోంమంత్రి అనిత
- June 18, 2025
విజయనగరం: యోగా జీవన విధానంలో భాగం కావాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ యోగా కార్యక్రమానికి అత్యంత ప్రధాన్యతనిస్తున్నారని, ఒకే రోజు ఒకే చోట 5 లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ చార్జ్ మంత్రి రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాల శాఖామంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డిలతో కలసి ఈ నెల 21న నిర్వహించే యోగా కార్యక్రమంపై మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీక్ష బూనారని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు.
నెల రోజుల నుండి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ సన్నద్ధం చేయడం జరుగుతోందని తెలిపారు. విశాఖపట్నంలో ఒకే రోజున ఒకే వేదిక నుండి 5 లక్షల మంది యోగ చేయడం ద్వారా దేశమంతా వైజాగ్ వైపు చూస్తుందని, అంతే కాకుండా గిన్నిస్ బుక్ స్థానం సంపాదిస్తామని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలనీ కోరారు. యోగా కార్యక్రమానికి వచ్చే వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులను వేసి రహదారి మార్గంలో అత్యవసరాల కోసం వాష్ రూమ్స్ న్ను గుర్తించడం జరిగిందని, వాటిని బస్సులతో మ్యాప్ చేయడం జరిగిందని, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఉదయాన్నే బస్సులు బయలుదేరతాయి కావున ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గం వారీగా సచివాలయం వారీగా నమోదు చేసుకున్న జాబితాలను సంబంధిత శాసన సభ్యులకు ఇవ్వాలని, వారు వారి కార్యకర్తల ద్వారా జన సమీకరణ లో భాగస్వామ్యులవుతారని తెలిపారు.సురక్షితంగా గమ్యాలను చేరే వరకు ఇన్ ఛార్జ్ లు బాధ్యత తీసుకోవాలని, అలాగే ట్రాఫిక్ నియంత్రణకు జాతీయ రహదారిపై హెవీ వాహనాలను తిరగకుండా నిరోధించాలని సూచించారు.
యోగా వేదిక వద్ద కంపార్ట్మెంట్లను కేటాయించడం జరుగుతుందని, ఎవరికీ ఏ కంపార్ట్మెంట్ కేటాయించారో, ఆ నెంబర్ వారు వెళ్ళే బస్సు పైన రాయడం జరుగుతుందని దాని ప్రకారంగా ఎటువంటి ఆందోళన పడకుండా ఇన్ ఛార్జ్ జాగ్రత్తగా తీసుకువెళ్లాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లా నుండి 36 వేల మందిని సిద్ధం చేసుకున్నామని, కనీసం 30 వేల మందిని పంపడానికి 2 రూట్లలో 660 బుస్సు లను సిద్ధం చేసామని, ప్రతి బస్సు కు ఒక లైజెన్ అధికారిని నియమించామని, సచివాలయం వారీగా బస్సులను, టాయిలెట్లను మాప్ చేయడం జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ