కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ

- June 18, 2025 , by Maagulf
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ

న్యూఢిల్లీ: పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలకు లోకేష్ కోరారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ... ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తాం.తిరుపతి ట్రిపుల్ ఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి నేను ఏపీకి వస్తున్నాను. జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నా. మీరు కూడా వస్తే  క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దాం. అన్నదాతలకు మేలు చేసేందుకు మోడీజీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని లోకేష్... చిరాగ్ పాశ్వాన్ కు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com