ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక: “వాట్సాప్‌ను వెంటనే తొలగించండి!”
- June 18, 2025
తమ దేశ ప్రజలు తక్షణమే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను తొలగించాలని ఇరాన్ ప్రభుత్వం సంచలన సూచన చేసింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్ సేకరించి, ఇజ్రాయెల్‌కు చేరవేస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్ర ఆరోపణలు చేసింది.
అధికారిక ప్రకటనతో సంచలనం
అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను ఇరాన్ ప్రభుత్వం బయటపెట్టలేదు. తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తల కదలికలను సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఇజ్రాయెల్, వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆరోపణల వెనుక ఏముంది?
ఈ ఆరోపణలపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పందించింది. “ఇలాంటి నిరాధారమైన ఆరోపణల ద్వారా భవిష్యత్తులో మా సేవలను ప్రజలకు అందకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నాం. మేము యూజర్ల లొకేషన్లను ట్రాక్ చేయము. వారి కార్యకలాపాలకు సంబంధించిన లాగ్‌లను కూడా మేం నిర్వహించము. వ్యక్తిగత సందేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చూడము. ఏ ప్రభుత్వంతోనూ పెద్ద మొత్తంలో సమాచారాన్ని పంచుకోము” అని వాట్సాప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫోన్ ట్రాకింగ్‌తో హత్యలు?
తమ దేశానికి చెందిన కీలక సైనిక జనరళ్లు, అణు శాస్త్రవేత్తలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ వారి సెల్‌ఫోన్లను ట్రాక్ చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గతంలో ఇస్మాయిలీ హనియే అనే వ్యక్తిని కూడా టెహ్రాన్‌లో ఇదే విధంగా హత్య చేశారని గుర్తు చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినప్పటికీ, అవి తమ లొకేషన్‌ను శత్రువులకు చేరవేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ గూఢచర్య వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి యాంటీ-ట్రాకింగ్ పరిజ్ఞానం ఉన్న ఫోన్లు వాడాలని సూచించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ డిజిటల్ యుద్ధం
ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సన్నిహిత సలహాదారు అయిన అలీ షాద్మానీ మరణించినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ప్రకటించాయి. గతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్
మరణించడంతో ఆయన స్థానంలో అలీ షాద్మానీని ఇటీవలే యుద్ధ సమయంలో దళాల అధిపతిగా ఖమేనీ నియమించారు. షాద్మానీ ఒక రహస్య ప్రదేశంలో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం గమనార్హం. గూఢచార సమాచారం కోసం టెక్ యాప్‌లు లక్ష్యం కావడమై రెండు దేశాల మధ్య విస్తృత డిజిటల్ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్ పౌరులు, అధికారులు అనుమానిత యాప్‌లను తొలగించుకోవాలని సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







