సేవా ఎలక్ట్రానిక్ డిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి??

- June 18, 2025 , by Maagulf
సేవా ఎలక్ట్రానిక్ డిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి??

తిరుమల: శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడాన్నే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అంటారు.

సేవా ఎలక్ట్రానిక్ డిప్ కింద ఉన్న శ్రీవారి సేవలు  

  • సుప్రభాతం 
  • తోమాల 
  • అర్చన 
  • అష్టాదళ  పాద పద్మారాధన 

రిజిస్ట్రేషన్ లింక్ 3 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత లక్కీ డిప్ రిజల్ట్స్ ను 3వ రోజున ప్రకటిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారు తితిదే ప్రకటించిన రుసుమును చెల్లించిన తర్వాత సేవలో పాల్గొనేందుకు ఒక రోజు అలాట్ చేస్తారు. అలాట్ చేసిన రోజున వచ్చి సేవలో పాల్గొనాలి. 

కింది విధంగా సేవా డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి

రిజిస్ట్రేషన్ లింక్ https://online.tirupatibalaji.ap.gov.in/

1. లాగిన్ అయ్యే విధానం 

పైన లింక్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ లో లాగిన్ అప్షన్ ప్రత్యక్షం అవుతుంది. అక్కడ మీ నంబర్ ఎంటర్ చేయగానే మీ నంబరుకు ఓటిపి వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి 

2. ఎలక్ట్రానిక్ డిప్ 

ఓటిపి ఎంటర్ చేయగానే వెబ్సైట్ లోకి ప్రవేశించి piligrim services అని కనబడుతోంది. దాని కింద  seva electronic dip అనే అప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద స్క్రీన్ షాట్ లో ఆ అప్షన్ సిర్కిల్ చేసివుంటుంది. 

3. seva electronic dip అప్షన్ మీద క్లిక్ చేయగానే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని పైకి స్క్రోల్ చేస్తే టిక్ పెట్టి continue నొక్కాలి 

4. ఆ తరువాత కింద స్క్రీన్ షాట్స్ లో ఉన్న విధంగా మీ డిటైల్స్ అప్లోడ్ చేయాలి. 

5. ఎంతమంది సేవలో పాల్గొంటారు అనే నంబర్ టైప్ చేసి , మిగిలిన డిటైల్స్ ఫీల్ చేయాలి 

6. డిటైల్స్ లొనే యాక్సెప్టెడ్ ఐడీ కార్డ్స్ అనే అప్షన్ ఉంటుంది 

ఆధార్ కార్డ్ 

పాస్ పార్ట్ (NRIలకు మాత్రమే)  

పైన సెలెక్ట్ చేసుకున్న ఐడీ కార్డ్స్ డీటెయిల్స్ నమోదు చేయాలి 

7. లక్కీ డిప్ సేవలు 

అన్ని నమోదు చేసిన తర్వాత కింద స్క్రీన్ షాట్ లో భక్తుల కోసం పలు ఆర్జిత సేవలు ఉన్నాయి 

8. సెలెక్ట్ సేవా మీద క్లిక్ చేస్తే కింద్ స్క్రీన్ షాట్ లో ఉన్న విధంగా డిస్ ప్లే అవుతుంది 


9.  వివిధ సేవల కోసం వేరు వేరు తేదీలను సెలెక్ట్ చేసుకోండి లేదా పైన స్క్రీన్ షాట్లో ఉన్నట్లు అన్ని సేవలను ఒకే తేదీన సెలెక్ట్ చేసుకోండి 

10. సేవలకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన తర్వాత కింద విధంగా confirm & submit మీద క్లిక్ చేసుకోండి. 

11. Submit చేసిన తర్వాత కింద స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా కనబడుతోంది. 

12. లక్కీ డిప్ రిజల్ట్స్ 

ఇలా లక్కీ డిప్ వెబ్సైట్ లో మీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత చివరి రోజున అంటే 3మూడో రోజున లక్కీ డిప్ రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఒకవేళ మీ పేరు అందులో ఉంటే మీరు ఎప్పుడు సేవలో పాల్గొనాలి అనే పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ లోనే పొందుపరచడం జరుగుతోంది. కింద స్క్రీన్ షాట్ ఉన్నట్లే వివరాలు వస్తాయి 

13. రిజల్ట్స్ ఎక్కడ చూసుకోవాలి 

లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యిన వారి వివరాలను తితిదే వెబ్సైట్ హోమ్ పేజీలో చూసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com