మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్

- June 18, 2025 , by Maagulf
మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది. ఇంగ్లాండ్ వేదిక‌గా జూన్ 12 నుంచి జూలై 5 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. జూన్ 12న జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, లండన్‌లోని ది ఓవల్, లార్డ్స్..లీడ్స్‌లోని హెడింగ్లీ, మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, సౌతాంప్ట‌న్‌లోని బ్రిస్టల్, యుటిలిటా బౌల్ లు మొత్తం ఏడు మైదానాల్లో 30 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మొత్తం 12 జ‌ట్లు ఈ ప్ర‌పంచ‌క‌ప్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా వాటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు.

గ్రూప్ 1లో ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా , ఇండియా, పాకిస్తాన్ , క్వాలిఫైయర్, క్వాలిఫైయర్ ఉండ‌గా.. గ్రూప్ 2 వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, క్వాలిఫైయర్, క్వాలిఫైయర్ జ‌ట్లు ఉంటాయి.

క్వాలిఫైయ‌ర్ జ‌ట్లు 2026 ప్రారంభంలో నిర్ధారించబడతాయి.

చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జూన్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్ వేదిక కానుంది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..

  • జూన్ 12 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్‌ శ్రీలంక – ఎడ్జ్‌బాస్టన్ 18:30 BST
  • జూన్ 13 – క్వాలిఫైయర్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 10:30 BST
  • జూన్ 13 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా – ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 13 – వెస్టిండీస్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ – హాంప్‌షైర్ బౌల్ 18:30 BST
  • జూన్ 14 – క్వాలిఫైయర్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – ఎడ్జ్‌బాస్టన్ 10:30 BST
  • జూన్ 14 – ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్ 14:30 BST
  • జూన్ 16 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ శ్రీలంక – హాంప్‌షైర్ బౌల్ 14:30 BST
  • జూన్ 16 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హాంప్‌షైర్ బౌల్ 18:30 BST
  • జూన్ 17 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హెడింగ్లీ 10:30 BST
  • జూన్ 17 – ఇండియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హెడింగ్లీ 14:30 BST
  • జూన్ 17 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్ 18:30 BST
  • జూన్ 18 – వెస్టిండీస్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హెడింగ్లీ 18:30 BST
  • జూన్ 19 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హాంప్‌షైర్ బౌల్ 18:30 BST
  • జూన్ 20 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హాంప్‌షైర్ బౌల్ 10:30 BST
  • జూన్ 20 – పాకిస్తాన్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హాంప్‌షైర్ బౌల్ 14:30 BST
  • జూన్ 20 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – హెడింగ్లీ 18:30 BST
  • జూన్ 21 – వెస్టిండీస్ వ‌ర్సెస్ శ్రీలంక – బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 10:30 BST
  • జూన్ 21 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ ఇండియా – ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 23 – న్యూజిలాండ్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 10:30 BST
  • జూన్ 23 – శ్రీలంక వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 23 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్ – హెడింగ్లీ 18:30 BST
  • జూన్ 24 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ వెస్టిండీస్- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 18:30 BST
  • జూన్ 25 – ఇండియా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 25 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 18:30 BST
  • జూన్ 26 – శ్రీలంక వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ 18:30 BST
  • జూన్ 27 – పాకిస్తాన్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 10:30 BST
  • జూన్ 27 – వెస్టిండీస్ వ‌ర్సెస్ క్వాలిఫైయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 27 – ఇంగ్లాండ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ – ది ఓవల్ 18:30 BST
  • జూన్ 28 – దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ క్వాలిఫైయర్ – లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 10:30 BST
  • జూన్ 28 – ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఇండియా- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 14:30 BST
  • జూన్ 30 – TBC వ‌ర్సెస్ TBC (సెమీ ఫైనల్ 1) – ది ఓవల్ 14:30 BST
  • జూలై 2 – TBC వ‌ర్సెస్ TBC (సెమీ ఫైనల్ 2) – ది ఓవల్ 18:30 BST
  • జూలై 5 – TBC వ‌ర్సెస్ TBC (ది ఫైనల్) – లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 14:30 BST 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com