హనీ ట్రాప్ లో చిక్కిన వృద్ధుడు రూ.38.73 లక్షలు నష్టం
- June 18, 2025
హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు రూ.38.73 లక్షలు కాజేశారు.ఈ ఘటన మొదట ఫేస్బుక్ లో మొదలైంది.వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్‌గా జీవనం సాగిస్తున్నదని పరిచయం చేసుకుంది.తన జీవిత కథను తేలికగా చెప్పి మానవత్వాన్ని రేకెత్తించిన ఆమె, వృద్ధుడితో చాటింగ్ చేయాలంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పారు. ఇందుకోసం ఆమె ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్‌ను ఇచ్చింది.
కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్..
వృద్ధుడు మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్‌కి సంప్రదించి రూ. 10,000 చెల్లించాడు. అయితే, ఈ చెల్లింపు అనంతరం ఆ మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో.. వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతను గ్రహించలేకపోయాడు.కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.ఆ సమాచారం విని వృద్ధుడు చలించిపోయి, వెంటనే మరో రూ. 10 లక్షలు అతనికి పంపించాడు.ఈ సహాయం అనంతరం కూడా మోసం ఆగలేదు. మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో రూ.2.65 లక్షలు వసూలు చేశారు.
ఈ క్రమంలో మొత్తం మొత్తం 38.73 లక్షలు వృద్ధుడు కోల్పోయాడు.తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరికి నిజమైన పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









