షార్జా లో 42 కిలోమీటర్ల కొత్త రోడ్
- July 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్రక్టచర్ డెవలప్‌మెంట్ షార్జాలో కొత్త రోడ్‌ని డెవలప్ చేయనున్నట్లు వెల్లడించింది. 174 మిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో 42 కిలోమీటర్ల మేర ఆర్టీరియల్ రోడ్‌ని నిర్మించనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. మినిస్ట్రీకి చెందిన రోడ్స్ మేనేజర్ ఇంజనీర్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, మలెహా రోడ్, 2018 రెండో క్వార్టర్‌లో పూర్తవుతుందని వివరించారు. ఎమిరేట్స్ రోడ్ పైన అల్ బదీయా ఇంటర్‌సెక్షన్ నుంచి ప్రారంభమయ్యే మేజర్ రోడ్ షేక్ ఖలీఫా ఇంటర్‌సెక్షన్ వద్ద ముగుస్తుందని తెలిపారు. శాండ్ అక్యుములేషన్‌ని తగ్గించేందుకు కొత్త రోడ్‌ని కాంక్రీట్ బారియర్స్‌తో కాకుండా ఐరన్‌తో నిర్మిస్తారు. రెండు వైపులా 28 రోడ్ డైవర్షన్లతో వాహనదారులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపనున్నారు. కొత్తగా నిర్మించే అన్ని రహదార్లపైనా భద్రత పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ సమస్యలకు ఆస్కారమే లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో రోడ్లను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







