ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి-ఆసుపత్రి నేలమట్టం
- June 19, 2025
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది.ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది.వరుసగా ఏడో రోజూ దాడులు-ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి.ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఇరాన్ తన ప్రతి దాడి తీవ్రతను పెంచింది.
బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.ఈ ఉదయం ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్షిపణి దాడిలో బీర్షెవాలోని సోరోకా ఆసుపత్రి ధ్వంసమైంది.ఈ మిస్సైల్ నేరుగా ఆసుపత్రిపై ఢీ కొట్టింది. ఫలితంగా భవనం నేలమట్టమైంది.నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చి బాలిస్టిక్ మిస్సైల్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాకింది. ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టమైంది. పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో పాటు టెల్ అవీవ్, రమత్ గాన్, హ్యాలోన్ లల్లో కూడా క్షిపణి దాడులు సంభవించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. టెల్ అవీవ్ దక్షిణాన ఉన్న హ్యాలోన్ లోని ఓ నివాస భవనంపై మిస్సైల్ పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వోల్ఫ్ సన్ మెడికల్ సెంటర్ తెలిపింది.రమత్ గాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని హీబ్రూ మీడియా పేర్కొంది.
ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్
సొరొకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఐడీఎఫ్ పేర్కొంది.సోరోకా ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ ఏర్పడినట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12 తెలిపింది. ఈ అనుమానంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని వెల్లడించింది.ఆసుపత్రి పై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియెల్ బుసో.. ఘాటుగా స్పందించారు.దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..