భారత్: వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మృతి..
- June 19, 2025
తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కారు బీభత్సం సృష్టించింది.వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో వ్యక్తి గాయపడ్డారు. రుద్రవరం వద్ద బైకును ఢీకొట్టిన కారు..ఆగకుండా అలానే వెళ్లిపోయింది.ఈ ప్రమాదంలో దత్తయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.
అనంతరం వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద మరో బైక్ అదే కారు ఢీకొట్టింది.దీంతో బైక్‌పై వెళ్తున్న ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.అనంతరం కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు.ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు..కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మెదక్-బోధన్ జాతీయ రహదారిలో ఇద్దరి మృతి
మెదక్–బోధన్ జాతీయ రహదారిలో ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయిపల్లి గ్రామ శివారులో పోచారం కాలువ పై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నర్సింగ్ రావు పల్లి తండాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు లూనావత్ పీర్యా (38), మరో వ్యక్తి కేతావత్ పీర్యా (32) లు అక్కడికక్కడే మృతి చెందగా, లూనావత్ వేణు (25), లూనా వత్ సోను (14), లూనావత్ చిన్నా (12) అనే ముగ్గురికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉందన్నారు.
పెద్దగుట్టకు వెళుతుండగా…
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నర్సింగరావు పల్లి తాండ నుండి నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్ట కు మొక్కులు తీర్చుకునేందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయి పల్లి గ్రామ సమీపంలో పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువపై జాతీయ రహదారి రోడ్డు వెడల్పు పనులలో బాగా ప్రధాన కాలువపై బ్రిడ్జిని నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో, రాత్రి వేళలో వెళ్తున్న కారుకు సరైన దారి కనిపించకపోవడంతో, బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన మట్టి రోడ్డుపై నుంచి పోచారం ప్రధాన కాలువలోకి కారు దూసుకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనాలలో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు, మృతదేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!