అత్యుత్తమ వైద్య సేవలకు ఐఎస్ఓ గుర్తింపు

- June 19, 2025 , by Maagulf
అత్యుత్తమ వైద్య సేవలకు ఐఎస్ఓ గుర్తింపు

విజయవాడ: గుండె జబ్బులకు అత్యున్నత శ్రేణి వైద్య సేవలందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటరుకు ఐఎస్ఓ 9001:2015 ధ్రువపత్రం లభించింది.నిర్దిష్ట ప్రమాణాలను కచ్చితంగా అనుసరిస్తూ సేవలందించినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ సాధ్యమైంది.ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు గురువారం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ ల చేతులమీదుగా ఐఎస్ఓ 9001:2015 ధ్రువపత్రాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు అందుకున్నారు.ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ పెద్దేశ్వరరావు మంచి మనసున్న వైద్యుడని, సామాన్య ప్రజలకు సైతం మెరుగైన గుండె వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు.పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అందిస్తున్న అత్యున్నత సేవలకు గుర్తింపుగా ఐఎస్ఓ ధ్రువీకరణ లభించడం హర్షణీయమని తెలిపారు.గుండె వైద్యం నుంచి ఆరంభించి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్న డాక్టర్ పెద్దేశ్వరరావు అభినందనీయులని కామినేని అన్నారు. అనంతరం,పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని,ఈ ప్రయాణంలో అనేక మైలురాళ్లను విజయవంతంగా అధిగమించామని అన్నారు. తమ హాస్పిటల్ కు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించడం తమకు గర్వకారణమని, ఈ స్ఫూర్తితో మరింత విస్తృతంగా వైద్య సేవలందిస్తామని వెల్లడించారు. హాస్పిటల్ సీఈవో డాక్టర్ ఆకాశ్ పల్లెం మాట్లాడుతూ, ‘కార్పొరేట్ క్వాలిటీ.. ఏన్ అబర్డబుల్ రియాలిటీ’ మోటోతో కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో అందించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.తమ హాస్పిటల్ ఇప్పటికే ఎన్ఏబీహెచ్ సర్టిఫికేషన్ కలిగివుందని, ఇప్పుడు ఐఎస్ఓ ధ్రువీకరణ లభించడం తమ హాస్పిటల్ విజయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని డాక్టర్ ఆకాశ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com