సూడాన్ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు
- July 13, 2016
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రెండు సీ-17 సైనిక రవాణా విమానాలను గురువారం దక్షిణ సుడాన్ రాజధాని జుబాకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది భారతీయులు దక్షిణ సూడాన్‌లో చిక్కుకున్నారు. సహాయ కార్యక్రమాలను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
గతేడాది యెమెన్‌లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వీకే సింగ్ మరోసారి బాధ్యత తీసుకున్నట్లు విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. సరైన ఇండియన్ ట్రావెల్ డాక్యుమెంట్లతో దక్షిణ సుడాన్ వెళ్లిన భారతీయులను మాత్రమే భారత్‌కు అనుమతిస్తామని కేవలం 5కిలోల సామానును మాత్రమే వారితో తీసుకువచ్చేందుకు వీలుంటుందని తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 600 మంది భారతీయుల్లో 450 మంది జుబాలో ఉండగా మిగతా 150 మంది వేరే ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







