భారీగా విమానాలు ఆర్డర్ ఇచ్చిన ఎయిర్ ఆసియా
- July 13, 2016
ప్రయాణికులకు చవక విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తాజాగా వంద కొత్త విమానాలు కొనడానికి ఆర్డర్ ఇచ్చింది. ఎ321 నియో రకం విమానాలను ఎయిర్ బస్ నుంచి కొనాలని ఎయిర్ ఏషియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫార్న్ బరోలో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రకటించారు. ఇప్పటికే ఈ సంస్థ వద్ద ఎయిర్ బస్ ఎ320 రకం విమానాలు 170 ఉన్నాయి. ఇవి భారతదేశంతో పాటు మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలలో తిరుగుతున్నాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ బస్ ప్రెసిడెంట్ ఫాబ్రిస్ బ్రేగియర్ ల మధ్య తాజా ఒప్పందం కుదిరింది.ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎ320 రకం విమానాలకు సంబంధించి ఇంత పెద్ద ఆర్డర్ రావడం ఇదే మొదటిసారి. ఎ321 నియోరకం విమానాలు తమ డిమాండుకు తగినట్లుగా సరిపోతాయని, దాంతోపాటు కిలోమీటరుకు అందుబాటులో ఉండే సీట్ల ఖర్చును కూడా బాగా తగ్గిస్తాయని టోనీ ఫెర్నాండెజ్ చెప్పారు. దీనివల్ల ప్రయాణికుల చార్జీలను తగ్గించే అవకాశం తమకు ఏర్పడుతుందన్నారు. మంచి మౌలిక సదుపాయాలున్న అన్ని ఎయిర్ పోర్టుల నుంచి ఈ విమానాలు నడిపిస్తామని, దానివల్ల ఒకే సమయంలో ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీలుంటుందని తెలిపారు. ఈ రకం విమానాల్లో ఒకేసారి 236 మంది ప్రయాణికులను తీసుకెళ్లచ్చు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







