ఆసుపత్రి పరికరాలు వేలం.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..!!
- June 25, 2025
యూఏఈ: దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ సంచలన తీర్పు వెలువరించింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి బకాయిలను చెల్లించడానికి సిటీ వాక్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వైద్య పరికరాలను వేలం వేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పును అనుసరించి.. జూలై 8న ఎమిరేట్స్ ఆక్షన్ తన రాస్ అల్ ఖోర్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
కొనుగోలుదారులు వేలం సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బిడ్ చేయవచ్చని తెలిపింది. అనేక మంది ఆసుపత్రి సిబ్బంది ఈ కేసును దాఖలు చేశారు. సుమారు Dh3.07 మిలియన్ల వరకు జీతాల బకాయిలను వేలం ద్వారా వచ్చిన సొమ్ముతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆసుపత్రి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా