విద్యార్థులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లు అందిస్తున్న షార్జా..!!
- June 25, 2025
యూఏఈ: ఎమిరేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పనితీరు కనబరిచిన టాప్ పది మంది ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్లకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లను అందిస్తున్నట్లు షార్జా పోలీసులు ప్రకటించారు. "లైసెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్"గా పిలువబడే ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీకి వెళ్లడానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది షార్జా పోలీస్ వెహికల్, డ్రైవర్ లైసెన్సింగ్ డిపార్ట్‌మెంట్, విద్యా మంత్రిత్వ శాఖ, షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ, షార్జా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, బెల్హాసా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.
అలాగే, "లైసెన్స్ ఫర్ సన్స్ ఆఫ్ డెడికేషన్" పేరుతో మరొక కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా షార్జా పోలీసు సిబ్బంది కుమారులకు శిక్షణ రుసుములపై 50 శాతం తగ్గింపును అందజేయనుంది. లైసెన్సింగ్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ ఖలీద్ మొహమ్మద్ అల్-కై మాట్లాడుతూ.. ఈ రెండు చొరవలు చిన్నప్పటి నుండే సురక్షితమైన డ్రైవింగ్ సంస్కృతిని ప్రోత్సహిస్తాయని అన్నారు.
మార్చి 29 నుండి అమల్లోకి వచ్చిన యూఏఈ కొత్త ట్రాఫిక్ చట్టం.. డ్రైవర్లకు కనీస వయోపరిమితిని తగ్గించింది. 17 సంవత్సరాల వయస్సు ఉన్నవారు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనుమతించారు. గతంలో ఇది 18 సంవత్సరాలుగా ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







