ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!

- June 25, 2025 , by Maagulf
ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!

దోహా: ఎమిరి దివాన్ లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్,  ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల విదేశాంగ మంత్రులతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దోహాలో సమావేశమయ్యారు. GCC సెక్రటరీ జనరల్ జాస్సిమ్ అల్బుదైవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా GCC విదేశాంగ మంత్రులు తమ భూభాగంపై ఇరాన్ దురాక్రమణను ఖండించారు. ఖతార్ కు సంఘీభావాన్ని తెలిపారు. ఈ దురాక్రమణ అంతర్జాతీయ చట్టం తోపాటు మంచి నేబర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని వారు అన్నారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరానిదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఉమ్మడి గల్ఫ్ దేశాల పురోగతి, GCC దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మార్గాలపై కూడా అమీర్, విదేశాంగ మంత్రులు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com