వీడియో వైరల్.. డ్రైవర్‌కు 2.5 సంవత్సరాల జైలు శిక్ష..!!

- June 25, 2025 , by Maagulf
వీడియో వైరల్.. డ్రైవర్‌కు 2.5 సంవత్సరాల జైలు శిక్ష..!!

మనామా: రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు ఒక వ్యక్తికి కోర్టు రెండు వేర్వేరు జైలు శిక్షలు విధించింది. ఏడవ మైనర్ క్రిమినల్ కోర్టు ఈరోజు రెండు తీర్పులు వెలువరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మొదటి కేసులో ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వాహనం నడిపినందుకు ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ఒక వ్యక్తి గాయపడి ప్రైవేట్ ఆస్తికి నష్టం వాటిల్లింది. కోర్టు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒక సంవత్సరం పాటు రద్దు చేశారు. ఈ సంఘటనలో వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశించింది.

ఇదే సంఘటనకు సంబంధించిన రెండవ తీర్పులో.. కోర్టు అతనికి అదనంగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అయిన తర్వాత, ప్రమాదకరమైన డ్రైవింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వాహనం నడుపుతూ, మరొక వాహనాన్ని ఫాలో అవుతూ..తన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టాడు.

వాహనదారులు ట్రాఫిక్ చట్టాలను పాటించాలని అధికారులు కోరారు. రోడ్లపై నిర్లక్ష్యంగా ప్రవర్తించడాన్ని సహించబోమని  , కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com