ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలేదా?
- June 25, 2025
జెరూసలేం: అమెరికా దాడులు టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు వెనక్కి నెట్టాయని అమెరికా నిఘా నివేదిక తేల్చినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై "చారిత్రక విజయం" అని ప్రకటించారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ మంగళవారం కాల్పుల విరమణకు అంగీకరించాయి. 12 రోజుల పాటు జరిగిన టైట్-ఫర్-టాట్ దాడులను ముగించాయి. వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఇరానియన్ అణు కేంద్రాలను నాశనం చేశారని ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై అమెరికా దాడులు దాని అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు వెనక్కి నెట్టాయని ప్రాథమికంగా US నిఘా నివేదిక తేల్చింది.
కాగా,కాల్పుల విరమణ ప్రకటన తర్వాత దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నెతన్యాహు "ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండదు" అని అన్నారు. "మేము ఇరాన్ అణు ప్రాజెక్టును అడ్డుకున్నాము" అని ఆయన అన్నారు. “ఇరాన్లో ఎవరైనా దానిని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తే, విఫలం చేయడానికి చర్య తీసుకుంటాము.” అని తెలిపారు.
జూన్ 13న ప్రారంభమైన తమ బాంబు దాడి ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా నిరోధించడమే లక్ష్యంగా ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ వాదనలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్.. తన దేశం తన అణు కార్యక్రమంపై చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే తన దేశం అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి "తన చట్టబద్ధమైన హక్కులను" కొనసాగిస్తుందని అన్నారు.
అమెరికా దాడులు ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లను లేదా సుసంపన్నమైన యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించలేదని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధనల గురించిన తెలిసిన వ్యక్తులు తెలిపారని మంగళవారం అమెరికా మీడియా ప్రధానంగాప్రస్తావించింది. నివేదిక ప్రకారం, భూగర్భ భవనాలను నాశనం చేయకుండా కొన్ని ప్రంతాల ప్రవేశాలను దాడులు మూసివేసాయన్నారు.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లీవిట్ ఆయా కథనాలపై స్పందించారు. “ఇలాంటి చర్యలు అధ్యక్షుడు ట్రంప్‌ను కించపరిచే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుడిచిపెట్టడానికి సంపూర్ణంగా అమలు చేసిన ధైర్యవంతులైన యుద్ధ పైలట్లను అప్రతిష్టపాలు చేసే స్పష్టమైన ప్రయత్నం.” అని పేర్కొన్నారు.
కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు కాల్పుల విరమణ అవకాశాన్ని స్వాగతించారు. "ప్రతి ఒక్కరూ అలసిపోయారు. మేము కొంత మనశ్శాంతిని పొందాలనుకుంటున్నాము" అని టెల్ అవీవ్ నివాసి టామీ షెల్ అన్నారు. “మా కోసం, ఇరానియన్ ప్రజల కోసం, పాలస్తీనియన్ల కోసం, ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి కోసం.” ఈ చర్య అత్యవసరం అని తెలిపారు. మరోవైపు ఇరాన్లో శాంతి నెలకొంటుందో లేదో అని అక్కడి ప్రజలు ఆందోళనగా ఉన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 610 మంది పౌరులు మరణించగా, 4,700 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







