QR కోడ్‌తో కొత్త పాన్ కార్డు 2.0
- June 26, 2025
న్యూ ఢిల్లీ: కొత్త పాన్ కార్డు కావాలా? ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే పాన్ కార్డ్ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త పాన్ 2.0ను ప్రవేశపెట్టింది. సెక్యూరిటీ పరంగా మొత్తం ప్రక్రియను (PAN Card 2.0) సులభతరం చేసింది.స్కాన్ చేయగల QR కోడ్‌తో e-PAN సౌకర్యాన్ని అందిస్తుంది.స్పీడ్ అథెంటికేషన్ అందిస్తుంది. పాన్ కార్డ్ ఫ్రాడ్ లేదా దుర్వినియోగ అవకాశాలను నివారిస్తుంది.
ఈ e-PAN డిజిటల్ వెర్షన్ ఫ్రీగా పొందవచ్చు. వెంటనే ఇమెయిల్ ద్వారా పొందవచ్చు. నామమాత్రపు రుసుము చెల్లించిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ రిజిస్టర్ అడ్రస్‌కు చేరుకుంటుంది. మీకు ఇప్పటికే QR కోడ్ లేని సాధారణ PAN కార్డ్ ఉంటే.. అది ఇప్పటికీ పూర్తిగా వ్యాలీడ్ అని గమనించాలి.
ప్రత్యేకించి అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ సాయంతో పాన్ కార్డు గుర్తింపు చాలా ఈజీ. నవంబర్ 26న పాన్ 2.0 ప్రాజెక్ట్ సమాచారంపై పాన్ 2.0 ద్వారా పాన్, టాన్ మేనేజ్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తెలిపింది.
పాన్ 2.0 ద్వారా జారీ చేసిన పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆధార్ కార్డు మాదిరిగా ఉంటుంది. స్కాన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటరు గుర్తింపు కార్డు
NSDL ద్వారా (PAN Card 2.0) కార్డుకు ఎలా అప్లయ్ చేసుకోవాలి?
- ముందుగా (Protean) రీ-ప్రింట్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- డిక్లరేషన్లను అంగీకరించి “Submit”పై క్లిక్ చేయండి.
- మాస్క్ పాన్ వివరాలను ధృవీకరించండి.
- OTP కోసం మొబైల్/ఇమెయిల్/రెండూ ఎంచుకోండి.
- ఇప్పుడు OTP వస్తుంది.10 నిమిషాల్లో వెరిఫై చేయండి.
- ఆ తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లి..నిబంధనలను అంగీకరించాలి.
- రూ.50 రుసుము చెల్లించండి.
- పేమెంట్ తర్వాత మీకు రసీదు వస్తుంది..అది సేవ్ చేసి పెట్టుకోండి.
- 24 గంటల తర్వాత మీ e-PAN డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఫిజికల్ పాన్ కార్డ్ రిజిస్టర్డ్ అడ్రస్‌కు 15 రోజుల నుంచి 20 రోజుల్లో డెలివరీ అవుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







