సౌదీ అరేబియాలో గ్రాసరిలకు కొత్త నిషేధం
- June 27, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చిన్న గ్రాసరి దుకాణాలు (బకాలాస్) ఇక పై పొగాకు ఉత్పత్తులు, ఖర్జూరాలు, మాంసం, పండ్లు, కూరగాయలు వంటి వస్తువులను విక్రయించలేవని సౌదీ మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు మరియు గృహాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని మంత్రి మాజిద్ అల్-హుగైల్ తీసుకున్నారు.దీని లక్ష్యం దేశవ్యాప్తంగా రిటైల్ రంగాన్ని పునఃవ్యవస్థీకరించి ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడమే.కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తున్నా, ప్రస్తుత గిరాకీ దుకాణాలకు ఆరు నెలల గడువు మంజూరు చేశారు.
నిషేధిత ఉత్పత్తులు:
- ఈ నూతన నిబంధనల ప్రకారం, చిన్న గ్రాసరి షాపులు, కియాస్కులు, మినీ మార్కెట్లు ఇకపై ఈ కింది వస్తువులను అమ్మకూడదు:
- పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు, ఈ-సిగరెట్లు, షీషా)
- ఖర్జూరాలు
- మాంసం
- పండ్లు మరియు కూరగాయలు
ఎక్కడ విక్రయించవచ్చో:
- ఈ ఉత్పత్తులను విక్రయించడానికి కేవలం ఈ సంస్థలకే అనుమతి ఉంటుంది.
- సూపర్ మార్కెట్లు – వీటికి మాంసం విక్రయానికి ప్రత్యేక లైసెన్స్ ఉండాలి.
- హైపర్ మార్కెట్లు – అన్ని నిషేధిత ఉత్పత్తులను ఏ ప్రత్యేక లైసెన్స్ అవసరం లేకుండా విక్రయించవచ్చు.
- కరెంట్ చార్జర్ కేబుల్లు, ప్రీ పెయిడ్ రీచార్జ్ కార్డులను మాత్రం అన్ని రకాల రిటైల్ షాపుల్లో అమ్మవచ్చు.
విస్తీర్ణ ప్రమాణాలు:
- కొత్త నిబంధనల ప్రకారం, రిటైల్ విభాగాల కనీస స్థల పరిమితులు ఇలా నిర్ణయించారు.
- గ్రాసరి దుకాణాలు – కనీసం 24 చదరపు మీటర్లు
- సూపర్ మార్కెట్లు – కనీసం 100 చదరపు మీటర్లు
- హైపర్ మార్కెట్లు – కనీసం 500 చదరపు మీటర్లు
వ్యాపారుల పై ప్రభావం:
- ఈ నిర్ణయం వేల సంఖ్యలో చిన్న గ్రాసరి షాపులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఖర్జూరాలు, కూరగాయలు, పొగాకు ఉత్పత్తులపై ఆధారపడే చిన్న వ్యాపారాలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి ఉంటుంది.
- వారు ఈ నిషేధిత వస్తువుల అమ్మకాన్ని కొనసాగించాలని అనుకుంటే, తమ దుకాణ విస్తీర్ణాన్ని పెంచి సూపర్ మార్కెట్ లేదా హైపర్ మార్కెట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవాలి.
వినియోగదారులకు మార్పు:
ఈ మార్పులతో కాలనీల్లో చిన్న షాపుల నుంచి తక్షణ అవసరాల కొనుగోళ్లు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, పెద్ద స్థాయి షాపులలో భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
గడువు అనంతరం కఠిన చర్యలు:
ఈ ఆరు నెలల అనుసరణ గడువు తరువాత, నియమాలు పాటించని దుకాణాలపై జరిమానాలు, షాపు మూసివేత వంటి చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
సౌదీ అరేబియాలో కొత్త రిటైల్ మార్గదర్శకాలు ప్రజారోగ్యానికి మద్దతు, చిన్న వ్యాపారులకు సవాలుగా మారనున్నాయి.
తాజా వార్తలు
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!







