నేషనల్ పెయింట్స్ గా మారిన జెబెల్ అలీ మెట్రో స్టేషన్..!!

- June 27, 2025 , by Maagulf
నేషనల్ పెయింట్స్ గా మారిన జెబెల్ అలీ మెట్రో స్టేషన్..!!

దుబాయ్: దుబాయ్ మెట్రో మరో స్టేషన్ పేరు మారింది. జెబెల్ అలీ మెట్రో స్టేషన్ ఇప్పుడు నేషనల్ పెయింట్స్ మెట్రో స్టేషన్ గా మారిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రకటించింది. జూలై నుండి అక్టోబర్ 2025 చివరి వరకు, RTA మెట్రో స్టేషన్లలో అన్ని సంబంధిత పేరు మార్పు పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.  కొత్త పేరు RTA స్మార్ట్ డిజిటల్ సిస్టమ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్లు, స్టేషన్ లో ఆన్బోర్డ్ ఆడియో ప్రకటనలలో కూడా మారుతుందన్నారు.

రెడ్ లైన్‌లోని మెట్రో స్టేషన్ దుబాయ్‌లోని అత్యంత డైనమిక్, వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రాలలో ఒకటైన జెబెల్ అలీ ఫ్రీ జోన్‌లో ఉంది. ఇది రాబోయే 10 సంవత్సరాల పాటు నేషనల్ పెయింట్స్ మెట్రో స్టేషన్ పేరును కలిగి ఉంటుందని RTA పేర్కొంది.

RTA రైల్ ఏజెన్సీ CEO అబ్దుల్ మొహ్సేన్ కల్బత్ మాట్లాడుతూ.. నేషనల్ పెయింట్స్ మెట్రో స్టేషన్ నేమింగ్ రైట్స్ ఇనిషియేటివ్‌లో చేరడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ కంపెనీ పేరు..యూఏఈలో విభిన్న కంపెనీలు, సంస్థలను ఆకర్షించిందన్నారు.

"దుబాయ్ ప్రపంచ స్థాయి రవాణా నెట్‌వర్క్‌లో కీలకమైన కనెక్టర్‌గా నిలిచే మెట్రో స్టేషన్ పేరు పెట్టే హక్కులను పొందడం మాకు గర్వంగా ఉంది." అని నేషనల్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్,  భాగస్వామి సమీర్ సయెగ్ అన్నారు.  “1969లో అమ్మాన్, జోర్డాన్‌లో జన్మించి, 1977 నుండి షార్జాలో ఉన్న కంపెనీగా, నేషనల్ పెయింట్స్ చాలా కాలంగా ఎమిరేట్స్ ఆర్థిక,  పట్టణ అభివృద్ధిలో అంతర్భాగంగా ఉంది. మెట్రోలో మా ఉనికి మిడిల్ ఈస్ట్‌లో నంబర్ వన్ కోటింగ్ బ్రాండ్‌గా మా స్థానాన్ని బలోపేతం చేస్తుంది.” అని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com