చట్టాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం..239 మంది అరెస్టు..!!
- June 27, 2025
కువైట్ః రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. పెద్ద ఎత్తున భద్రతా ఆపరేషన్‌లో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్లను నిర్వహించింది.మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు.. మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 239 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, అరెస్టు చేసిన వారిని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







