గత వారం దుబాయ్ లో వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి 8 మందికి గాయాలు
- July 13, 2016
దుబాయ్: గత వారం దుబాయ్ లో వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి 8 మందికి గాయాలపాలైనట్లు కల్నల్ జమాల్ మొహమ్మద్ అల్ బాన్నై దుబాయ్ పోలీస్ జనరల్ ట్రాఫిక్ విభాగానికి డైరెక్టర్, బుధవారం తెలిపారు.
గత ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో దుబాయ్ వైపు అల్ ర్యాబేట్ రోడ్ మీద ఒక రోడ్డు ప్రమాదం సంభవించింది.ఒక ట్రక్ తిరగబడి నడక మార్గం మీదకు దూసుకొని వచ్చి ఒక రైతుని దారుణంగా హతమార్చిందని అల్ బాన్నైవివరించారు. అలాగే రెండవ ప్రమాదంలో అదే రోజూ సాయంత్రం 4.30 గంటల సమయంలో ముజాయిరెహ్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వాహనం ఇనుము అడ్డంకులు డీకొట్టడంతో ఆ వాహన డ్రైవర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. మూడో ప్రమాదంలో షార్జా వైపు, షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డు మీద సంభవించింది, మరియు ఒక మోటార్ సైకిల్ ఒక చిన్న వాహనంను డీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు. నాల్గవ రోడ్డు ప్రమాదం అదే రోడ్డు మీద డ్రైవర్ ఒక పాదచారుని డీ కొట్టాడు గత సోమవారం ఈ ప్రమాదం సంభవించింది.ఐదవ ప్రమాదంలో వారి వాహనం ఒక కాంక్రీట్ గోడని డీకొట్టడంతో ఐదుగురికి గాయాలతో బతికి బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రమైన గాయాలు తగిలాయి. ఆరవ ప్రమాదంలో రెండు ట్రక్కులలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో సివిల్ డిఫెన్స్ జట్లు త్వరగా నీళ్ళు జల్లడంతో పెద్ద అగ్ని ప్రమాదం తప్పిపోయింది. అగ్నిమాపక దళం నిర్వహించిన సేవలకు దుబాయ్ రోడ్ల శాఖ ధన్యవాదాలు తెలిపిందని అల్ బాన్నై తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







