కమల్ హాసన్ కు అరుదైన గౌరవం
- June 29, 2025
చెన్నై: టాలీవుడ్ దిగ్గజం కమల్ హాసన్‌ని ఆస్కార్ అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే.ఎన్నో దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగంలో అనేక అవార్డులు, జాతీయ, రాష్ట్ర, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న కమల్ హాసన్‌కి ఈ గౌరవం దక్కడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు స్వాగతిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కమల్ హాసను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఈ క్షణం భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన క్షణం అంటూ పవన్ సంతోషం వ్యక్తం చేశారు.
కమల్ హాసన్ కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి ఫిలిం మేకర్ అని అన్నారు. రచన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు సహా సినిమాలోని ప్రతి అంశంపై ఆయనలో ఎంతో నైపుణ్యం ఉంది. కమల్ హాసన్ ఆరు దశాబ్దాల విశిష్ట కెరీర్‌ను ప్రస్థావిస్తూ, పవన్ ఆయనను నిజమైన కళాఖండంగా అభివర్ణించడం జరిగింది.మిస్టర్ హాసన్ ప్రభావం జాతీయ సరిహద్దులకు మించి విస్తరించింది. నటుడిగా, కథకుడిగా,దర్శకుడిగా ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ సినిమా సహా ప్రపంచ సినిమా పై శాశ్వత ప్రభావాన్ని చూపిందంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి