యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో బిగ్ ట్విస్ట్..
- June 29, 2025
హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ మృతికేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి అడ్వకేట్‌తో కలిసి పూర్ణ చందర్ చిక్కడపల్లి పీఎస్‌లో లొంగిపోయాడు.దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.జవహర్ నగర్‌లోని తన నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే, స్వేచ్ఛ మృతికి పూర్ణచందర్ కారణమని ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదుతో పోలీసులు అతని పై 69బీఎన్ఎస్, 108 బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్వేచ్ఛతోపాటు తననుకూడా పూర్ణచందర్ ఇబ్బంది పెట్టాడని ఆమె కుమార్తె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది.దీంతో అతనిపై ఫోక్సో కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. గత కొన్నాళ్ల నుంచి పూర్ణచందర్‌తో స్వేచ్ఛ సహజీవనం చేస్తుంది.ఈ క్రమంలో స్వేచ్ఛను వివాహం చేసుకోకుండా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.పూర్ణచందర్ వేధింపులు భరించలేక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







