కొత్త మానవరహిత ఉపరితల నౌకలను ప్రారంభించిన కువైట్..!!

- July 01, 2025 , by Maagulf
కొత్త మానవరహిత ఉపరితల నౌకలను ప్రారంభించిన కువైట్..!!

కువైట్: కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ సౌద్ అల్-సబా సోమవారం నాడు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ది కోస్ట్ గార్డ్‌లో కువైట్ కోస్ట్ గార్డ్ నౌకాదళంలో చేరిన మానవరహిత ఉపరితల నౌకలను (USVలు) ప్రారంభించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సముద్ర భద్రతను పెంపొందించడానికి కువైట్ కోస్ట్ గార్డ్ అమలు చేసిన సమగ్ర ప్రణాళికలో భాగంగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ మెస్ఫర్ అల్-అద్వానీ, సరిహద్దు భద్రతా రంగానికి అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ముజ్బిల్ ఫహద్ బిన్ షాక్ పాల్గొన్నారు.

కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ కమోడోర్ షేక్ ముబారక్ అలీ అల్-సబా.. USV ల అధునాతన కార్యాచరణ సామర్థ్యాలపై వివరణాత్మక బ్రీఫింగ్‌ను అందించారు. అవి మానవ సాయం లేకుండా రోజుల తరబడి స్వయంప్రతిపత్తితో పనిచేయగలవని చెప్పారు. నిఘా, నిరంతర పర్యవేక్షణ, అనుమానాస్పద సముద్ర లక్ష్యాలను అడ్డగించడం, సెర్చ్ - రెస్క్యూ కార్యకలాపాలకు మద్దతు, పర్యావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడం, సహజ వనరులను రక్షించడం, కువైట్ ప్రాదేశిక జలాల్లో మొత్తం సముద్ర భద్రతా అమలు వాటి కీలకమైన మిషన్లలో ఉన్నాయని ఆయన వివరించారు.

షేక్ ఫహాద్ ప్రస్తుతం అమలు చేయబడుతున్న అధునాతన సముద్ర పర్యవేక్షణ వ్యవస్థను కూడా తనిఖీ చేశారని నివేదిక హైలైట్ చేసింది. ఈ వ్యవస్థ కువైట్ మొత్తం సముద్ర ప్రాంతాన్ని కవర్ చేస్తుందన్నారు. కృత్రిమ మేధస్సుతో నడిచే ఏకీకృత కమాండ్, నియంత్రణ వ్యవస్థ కింద తీరప్రాంత రాడార్లు, సెన్సార్లు, హై రిజల్యూషన్ కెమెరాలు, మానవరహిత ఉపరితల నౌకలను అనుసంధానిస్తుందని పేర్కొన్నారు.

దాంతోపాటు , షేక్ ఫహాద్ సముద్ర కార్యకలాపాల కేంద్రాన్ని పర్యటించారు. USV లను నియంత్రించే, నిర్వహించే నియంత్రణ కేంద్రంతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, సముద్ర యూనిట్లను కమాండ్ సెంటర్లతో అనుసంధానించే ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్‌ను సమీక్షించారు. ఈ ప్రధాన ప్రాజెక్టును అమలు చేసినందుకు కోస్ట్ గార్డ్ జనరల్ డైరెక్టరేట్‌ను షేక్ ఫహద్ ప్రశంసించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com