కువైట్ లో అమల్లోకి ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్..!!

- July 02, 2025 , by Maagulf
కువైట్ లో అమల్లోకి ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్..!!

కువైట్: కువైట్ లో ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులు దేశం నుండి బయటకు వెళ్లే ముందు వారి యజమాని నుండి ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది.  “ఈసెల్” లేబర్ పోర్టల్ లేదా “సహెల్ – ఇండివిజువల్” మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఇప్పటికే 35,000 కంటే ఎక్కువ డిపార్చర్ పర్మిట్లు పొందారు.

అయితే, పర్మిట్ మంజూరు చేయడానికి నిరాకరించే యజమానుల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు తెలిపారు. ఏవరైనా కార్మికుడు తిరస్కరణను ఎదుర్కొంటే, వారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ కింద లేబర్ రిలేషన్స్ యూనిట్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

కాగా, యజమాని ఆమోదించినంత వరకు ఒక కార్మికుడు సంవత్సరంలో ఎన్నిసార్లు డిపార్చర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదన్నారు. కార్మికులు సులభమైన కంపెనీల లేబర్ పోర్టల్ లేదా సాహెల్ - ఇండివిజువల్ ప్రభుత్వ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com