ఏఐజీ హాస్పిటల్స్ ప్రారంభించిన సీఎం రేవంత్
- July 02, 2025
హైదరాబాద్: ఏడాదిలో ఏదో ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు.విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ (NIMS) లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తామని అంటూ త్వరలో మరో 25 ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
బంజారాహిల్స్‌లో నెలకొల్పిన ఏఐజీ ఆస్పత్రిని సీఎం నేడు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు.తెలంగాణ, హైదరాబాద్‌కు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయన భారతరత్నకు అర్హులని రేవంత్ అన్నారు.. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కోసం 66 దేశాల నుంచి రోగులు రావడం మనకు గర్వకారణమన్నారు..
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని,. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందన్నారు రేవంత్. హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. విద్యా వైద్యంకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు, రూ.21500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..







