షార్జాలో 2 నెలల పాటు రెండు కీలక రోడ్లు మూసివేత..!!
- July 02, 2025
దుబాయ్: యూఏఈ అంతటా రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టారు ఎతిహాద్ రైలు ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రధాన వీధులను రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. ఈ చొరవ ట్రాఫిక్ మళ్లింపులకు కారణమవుతుందని భావిస్తున్నారు. కానీ ఎమిరేట్ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను హామీ ఇస్తుందని పేర్కొన్నారు. మూసివేయబోయే రోడ్లు యూనివర్సిటీ బ్రిడ్జి సమీపంలోని మ్లీహా రోడ్, షార్జా రింగ్ రోడ్‌ను అనుసంధానించే రోడ్లు అనితెలిపారు. మూసివేత ఆంక్షలు రెండు నెలల పాటు(జూలై 1 -ఆగస్టు 30 వరకు) కొనసాగుతాయని వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







