దుబాయ్‌లో మూడు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి
- July 02, 2025
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ గమ్యస్థానంగా తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. తాజాగా 2025-26 విద్యా సంవత్సరంలో మూడు కొత్త అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు దుబాయ్‌లో తమ క్యాంపసులను ప్రారంభించనున్నట్లు దుబాయ్‌లోని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) ప్రకటించింది.
ప్రారంభమయ్యే మూడు విశ్వవిద్యాలయాల్లో భారతదేశానికి చెందిన ప్రసిద్ధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్ (ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మరియు మేనేజ్‌మెంట్ విభాగంలో 27వ స్థానం), లెబనాన్‌కు చెందిన అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్ (ప్రపంచ ర్యాంకింగ్‌లో 237వ స్థానం), మరియు సౌదీ అరేబియాకు చెందిన ఫకీహ్ కాలేజ్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి.
ఇవి కాకుండా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు దుబాయ్‌లో తమ క్యాంపసుల ఏర్పాటు కోసం ఆసక్తి చూపుతున్నాయని, కొన్నింటి అనుమతులు మంజూరయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
KHDAలోని స్ట్రాటెజిక్ డెవలప్‌మెంట్ విభాగం సీఈవో డాక్టర్ వాఫీ దావూద్ మాట్లాడుతూ, “ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఆకర్షించాలన్న దుబాయ్ అభియానం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మద్దతుతో ముందుకుసాగుతోంది. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, దుబాయ్‌ను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నాయకత్వం చూపుతున్నాం,” అని అన్నారు.
ఈ కార్యక్రమం దుబాయ్ ఎకనామిక్ అజెండా D33 మరియు Education 33 స్ట్రాటెజీతో అనుసంధానమై ఉన్నదని, దీని ద్వారా విద్యా పర్యాటకాన్ని పది రెట్లు పెంచడం, ఎమిరతి యువతను భవిష్యత్తు రంగాలలోకి చేర్చడం, మరియు దుబాయ్ ఆర్థిక వ్యవస్థను రెండు రెట్లు పెంచడం లక్ష్యమని వివరించారు.
ప్రస్తుతం దుబాయ్‌లో 41 అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో 37 యూనివర్సిటీలు అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపసులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మాంచెస్టర్ యూనివర్సిటీ (ప్రపంచ ర్యాంకింగ్‌లో 35వ స్థానం), బర్మింఘామ్ యూనివర్సిటీ (76వ స్థానం) వంటి టాప్ 100లో ఉన్న హోమ్ క్యాంపసులు ఉన్నాయ్. కర్టిన్ యూనివర్సిటీ (183వ స్థానం), వుల్లాంగాంగ్ యూనివర్సిటీ (184వ స్థానం) కూడా టాప్ 200లో ఉన్నాయి.
ఇంకా బిజినెస్ మరియు మేనేజ్‌మెంట్ విభాగంలో లండన్ బిజినెస్ స్కూల్ (7వ స్థానం), ESCP (54వ స్థానం), లూయిస్ యూనివర్సిటీ (67వ స్థానం) వంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. డిజైన్ రంగంలో Instituto Marangoni టాప్ 100లో స్థానం పొందింది.
Education 33 స్ట్రాటెజీలో భాగంగా నిర్వహిస్తున్న గ్లోబల్ యూనివర్సిటీ అట్రాక్షన్ ప్రాజెక్టు ద్వారా, 2033 నాటికి విదేశీ విద్యార్థులు దుబాయ్‌లో ఉన్నత విద్యా సంస్థలలో 50 శాతం ఉండేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది దుబాయ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రంగానికి AED 5.6 బిలియన్ జీడీపీలో భాగస్వామ్యం చేయనుంది.
ఇటీవల (2024–25 విద్యా సంవత్సరం) దుబాయ్‌లో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు రేటు 20 శాతం పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 29 శాతం పెరిగింది. ప్రస్తుతం 41 ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో మొత్తం 42,026 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటిలో 700 కంటే ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దుబాయ్ ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!