ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్..!
- July 02, 2025అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ పాఠశాలలు గురువారం (జూలై 3) బంద్ పాటించనున్నాయని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రకటించింది. విద్యా శాఖలో అధికారులు అనుసరిస్తున్న తీరుపై నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చింది. అధికారుల తనిఖీలు, నోటీసులు, అతివాద చర్యలతో పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అసోసియేషన్ ఆరోపించింది. అందుకే తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒకరోజు పాఠశాలలను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. కానీ అధికారుల తీరు పై ఆగ్రహం
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం పలు విధాలుగా సహకరిస్తున్నప్పటికీ, జిల్లాల అధికారుల మానవీయతలేని విధానం వల్ల స్కూళ్లు ఇబ్బందులు పడుతున్నాయని పాఠశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి.ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును 10 సంవత్సరాల వరకు పొడిగించినందుకు, విద్యార్థులకు “తల్లికి వందనం”, ప్రతిభా అవార్డుల వంటి పథకాల ద్వారా మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం మంచి పని చేస్తోందని వారు అభినందించారు. అయితే అదే సమయంలో, కొన్ని కమిటీల విచారణలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేయడం, హడావుడిగా తనిఖీలు చేయడం యాజమాన్యాలను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
విధుల్లో జోక్యం మానాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఆఫీసర్లు తమ అధికారాలను అతి వేగంగా వినియోగిస్తూ, నియమాలు సరిగా అధ్యయనం చేయకుండా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆరోపించాయి. దీంతో టీచర్లు, సిబ్బంది, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని, నిర్ణయాలు తీసుకునే ముందు సదుద్దేశంతో చర్చలు జరపాలని కోరారు. బంద్ దృష్ట్యా తల్లిదండ్రులు, విద్యార్థులు జూలై 3న పాఠశాలలకు వెళ్లకూడదని సూచించారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







